మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్‌తో పూల వర్షం.. నల్గొండలో అభిమానుల ఘన స్వాగతం

Published : Dec 18, 2023, 03:40 PM IST
మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్‌తో  పూల వర్షం.. నల్గొండలో అభిమానుల ఘన స్వాగతం

సారాంశం

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా నల్గొండ (Nalgonda)కు చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి అభిమానులు ఘటన స్వాగతం పలికారు. మంత్రిపై హెలికాప్టర్ తో పూల వర్షం ( helicopter showered flowers on Minister Komati Reddy)కురిపించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సోమవారం మొదటి సారిగా నల్గొండకు చేరుకున్న ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం లభించింది. నల్గొండ బైపాస్ దగ్గర నుంచి మొదలైన ఈ విజయోత్సవ యాత్రకు అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలే కనిపించాయి.

భారత్ మళ్లీ కోవిడ్ కలకలం.. 5 మరణాలు, 335 కొత్త కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే ?

ముందుగా నల్గొండ ఎస్పీ కె. అపూర్వరావు బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు డీజే పాటలు, టపాకులు పేల్చడంతో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అభిమానులు మంత్రికి ఊహించని, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాపకాన్ని అందించారు. నల్గొండ చరిత్రలో ఎవరికీ లభించని విధంగా, మంత్రి వెంకట్ రెడ్డిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. 

అనుకోకుండా అక్కడికి హెలికాప్టర్ రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు కూడా ఆసక్తిగా గమనించారు. హెలికాప్టర్ పై నుంచి పూల వర్షం నేరుగా మంత్రిపై కురిసింది. మంత్రిపై ఉన్న అభిమానంతో చల్లురి మురళీధర్ రెడ్డి ఈ హెలికాప్టర్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి బైపాస్ సమీపంలో ఉన్న అంబెడ్క్ర్ నెహ్రూ, బాబు జగ్జీవన్ రామ్ విగ్రమాలకు పూల మాలలు వేసి, నివాళి అర్పించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !