మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. నాగర్‌ కర్నూల్‌లో ఉద్రిక్తత

By Sairam Indur  |  First Published Dec 18, 2023, 2:29 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former MLA Guvwala Balaraju arrest)ను పోలీసులు అరెస్టు చేయడమే దీనికి కారణం. ఆయనను విడుదల చేయాలని బీఆర్ఎస్ (BRS)కార్యకర్తలు, నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.


బీఆర్ఎస్ నాయకుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ముగిసిన తరువాతతొ లిసారిగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తున్నారు. అయితే అచ్చంపేటలో కాంగ్రెస్ కూడా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు హఠాత్తుగా వెల్దండ వద్ద ఆపారు. 

భారత్ మళ్లీ కోవిడ్ కలకలం.. 5 మరణాలు, 335 కొత్త కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే ?

Latest Videos

అనంతరం ఆయనను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ విషయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తెలియడంతో పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గువ్వల బాలరాజు అరెస్టును ఖండిస్తూ వారంతా స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అచ్చంపేట మాజి ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు

అచ్చంపేట మాజి ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద అడ్డుకుని అక్రమంగా… pic.twitter.com/CaLOGVqbie

— Guvvala Balaraju (@GBalarajuTrs)

మాజీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పోలీసుల సాయంతో బీఆర్‌ఎస్‌ నాయకులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

click me!