''హరికృష్ణ బ్రతికుంటే ఈ నిర్ణయంపై ప్రశ్నించేవాడు''

By Arun Kumar PFirst Published Oct 1, 2018, 9:02 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారంతోనే కాదు మాటలతోనూ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలని నాయకులు మాటల ఘాటును పెంచారు. ఇలా ప్రచారంలోనూ, ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నాల్లోను టీఆర్ఎస్ పార్టీ  ముందుంది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా తెలంగాణలో కాంగ్రెస్-టిడిపి పొత్తులపై మాట్లాడుతూ...టిటిడిపిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించారు.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టిడిపి పార్టీ ఆవిర్భావం జరిగిందని తలసాని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు అదే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం ఏంటని తలసాని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణలో పర్యటన చేపడుతున్న నందమూరి బాలకృష్ణ సమాధానం చెప్పాలని అన్నారు. ఇలా కాంగ్రెస్ తో టిటిడిపి పొత్తు పెట్టుకోవడం గురించి బాలకృష్ణ సీరియస్ గా ఆలోచించి స్పందించాలన్నారు.

అయితే ఇటీవలే చనిపోయిన నందమూరి హరికృష్ణ బ్రతికుంటే ఈ విషయంపై ఖచ్చితంగా ప్రశ్నించేవారని తలసాని అన్నారు. హరికృష్ణ లేరు కాబట్టి బాలకృష్ణ అయినా ఈ పొత్తులపై స్పందిస్తే బావుటుందని తలసాని సూచించారు.

 తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడింది మహాకూటమి కాదని... అదో రకమైన ముఠా అని తలసాని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ టీడీపీ కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్ తో కలుస్తోందని మండిపడ్డారు. టీడీపీని కాంగ్రెస్ కు చంద్రబాబు తాకట్టుపెట్టారని తలసాని విమర్శించారు. 

కాంగ్రెస్, టీజెఎస్ పార్టీలు మహాకూటమిలో కలిసినా పరవాలేదు కానీ టీడీపీ కలవడమే దారుణమని అన్నారు. దీని ప్రభావం ఏపీ ఎన్నికలపై కూడా పడుతుందని తలసాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు క్షమించరు: మంత్రి తలసాని

click me!