మటన్ కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు (A friend was killed in a fight over mutton). స్నేహితుడే మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణ (telangana)లోని సికింద్రాబాద్ (secunderabad)లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మటన్ కోసం జరిగిన గొడవల్లో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. తాజాగా ఇలా జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. స్నేహితుడి చేతిలో మరి స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇక ఫాస్టాగ్ కూ కేవైసీ.. ఇంకా 15 రోజులే గడువు..! లేకపోతే డీ యాక్టివేట్..
వివరాలు ఇలా ఉన్నాయి. గోల్ బాయ్ బస్తీలో చారి, అజయ్ అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి మటన్ తింటున్న క్రమంలో గొడవ మొదలైంది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. అయితే అప్పటికే వారిద్దరూ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారు. దీంతో అది మరింత ముదిరింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
దీంతో క్షణాకావేశంలో అజయ్ కత్తి తీసుకొని చారిని పొడిచాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అధికంగా రక్తస్రావం జరగడంతో చారి అక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. విచారణ మొదలపెట్టారు.
మోడీ మళ్లీ ప్రధాని అయిన రోజు దేశ ప్రజలందరికీ సంక్రాంతి - కిషన్ రెడ్డి
అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా.. ఇటీవల మటన్ విషయంలో జరిగిన గొడవ వల్ల నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మెట్ పల్లికి చెందిన యువకుడికి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల పెద్దలు కట్నకానుకలు మాట్లాడుకుని పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే గత నెల నవంబర్ లో వధూవరులకు నిశ్చితార్థం చేసారు. ఈ ఆనందంలో అమ్మాయి కుటుంబం మేక మాంసంతో పసందైన దావత్ ఏర్పాటు చేశారు. ఓవైపు నిశ్చితార్థ వేడుక జరుగుతుండగా మరోవైపు ఏటకూరతో ఏర్పాటుచేసిన విందును అతిథులకు వడ్డించారు.
కదిలే స్కూటీపై జంట రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో రోడ్డుపైనే రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్..
ఇలా మగపెళ్ళివారికి సకల మర్యాదనలతో విందు వడ్డిస్తుండగానే ఊహించని గొడవ మొదలయ్యింది. అబ్బాయి తరపువారిలో ఎవరో నల్లి బొక్క కావాలని అడిగితే వడ్డించేవారు వేయలేదట. ఇది తమను అవమానించడమేనని భావించిన మగపెళ్ళివారు అమ్మాయి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త మరింత ముదిరి ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అయితే తరువాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.