
సాధారణంగా పాములు చిన్న చిన్న చేపలను, కప్పలను, ఎలుకలను మింగేస్తుంటాయి. కొన్ని సార్లు పెద్ద ఎలుకలను మింగి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు చూస్తుంటాం.. కానీ చేపలు ఎప్పుడైనా పామును మింగటం చూశారా..? కానీ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో అలాంటి అసాధారణమైన, విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
హమ్మయ్య.. తిరుమలలో చిరుత చిక్కింది..
దంతాపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామ శివారులో పాలేరు వాగుపై ఒక చెక్ డ్యాం ఉంది. అయితే ఆదివారం ఆ చెక్ డ్యాం నీటిలో వాలుగ రకానికి చెందిన చేప ఓ పామును మింగింది. పొడవుగా ఉన్న ఆ తాచుపామును నోట్లో నుంచి పొట్టలోకి పంపించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ పెద్దపామును అది పూర్తిగా పొట్టలోకి పంపించలేకపోయింది.
పంజాబ్ లో పాక్ చొరబాటుదారుడిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. స్వతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఘటన
అయితే ఆ చేప బారి నుంచి తప్పించుకోవడానిక పాము, దానిని మింగేయడానికి చేప తీవ్రంగా నీటిలో పోరాడాయి. ఈ విచిత్ర దృష్యాలను అక్కడే ఉన్న గ్రామస్తులు చూశారు. ఈ పోరాటంలో రెండూ ఓడిపోయాయి. చివరికి అవి నీటిలో తేలుతూ మెళ్లగా వాగు ఒడ్డుకు వచ్చాయి. గ్రామస్తులు వాటిని నీటిలో నుంచి బయటకు తీశారు. తరువాత పామును చేప కడుపులో నుంచి బయటకు తీశారు. అందులో నుంచి పొడవైన తాచుపాము బయటపడింది. దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.