
హైదరాబాద్: టమాట ధరలు దిగివచ్చాయి. రాష్ట్ర రాజధాని నగరంలో కిలో టమాట ధరలు రూ. 200కు చేరువైన సంగతి తెలిసిందే. అయితే, ధరలు మెల్లిగా దిగుతూ వచ్చాయి. తాజాగా, రైతు బజార్‌లో కిలో టమాట ధర రూ.39కి పలికింది. రిటైల్ దుకాణాలు, కాలనీలలో కిలో టమాటకు రూ. 50 నుంచి రూ. 60 వరకు పడే అవకాశాలు ఉన్నది. అంతేకాదు, త్వరలోనే టమాట ధరలు మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి.
జూన్‌లో భారీ కురిసిన వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లలో పండించిన పంట నష్టపోయింది. దీంతో ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఎగుమతి చేసే కమీషన్ ఏజెంట్లు రేట్లు భారీగా పెంచేశారు. వాస్తవానికి ఈ ఏడాది తొలినాళ్లలో కిలో టమాట ధర రూ. 10 నుంచి రూ. 20గా ఉండింది. కానీ, ఆ తర్వాత కృత్రిమ కొరత కూడా సృష్టించి డబుల్ సెంచరీకి దగ్గరగా రేట్లను తీసుకెళ్లారు.
Also Read: లిఫ్ట్ ఇస్తామని మహిళపై గ్యాంగ్ రేప్.. తలకు తుపాకీ గురిపెట్టి బెదిరింపు
ఏపీలోని మదనపల్లె మార్కెట్‌లో టమాట ధర ఏకంగా రూ. 200 పలికిన మాట తెలిసిందే. ఇప్పుడు అక్కడ కూడా టమాట ధరలు తగ్గిపోయాయి. టమాటలకు తోడు పచ్చి మిర్చి రేట్లు కూడా భారీగా పెరిగాయి. గత నాలుగైదు రోజుల క్రితం వరకు కిలో పచ్చి మిర్చి రూ. 100గా ఉన్నది. తాజాగా, ఆదివారం నాటికి ఈ ధర రూ. 60కి తగ్గింది. రైతు బజార్‌లో మరో పది రూపాయాలు తక్కువగా పలుకుతున్నది.