బంగారు గొలుసు కోసం గొడవ.. క్షణికావేశంలో భర్తను చంపేసిన భార్య.. ఎక్కడంటే ?

Published : Oct 22, 2022, 10:40 AM IST
బంగారు గొలుసు కోసం గొడవ.. క్షణికావేశంలో భర్తను చంపేసిన భార్య.. ఎక్కడంటే ?

సారాంశం

బంగారు గొలుసు కోసం ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో భర్త తన భార్యను తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన భార్య క్షణికావేశంలో భర్తను హతమార్చింది. 

వారిద్దరికీ అది రెండో పెళ్లి. ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలం నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బంగారు గొలుసు వల్ల వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో భార్య, భర్తను హతమార్చింది.

హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా..?

వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లికి చెందిన 38 ఏళ్ల రాములు స్పందన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2017లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు ఎన్టీపీసీ పీటీఎస్ లోని ఓ సర్వెంట్ క్వార్టర్ట్ లో కాపురం చేస్తున్నారు. రాములు ఓ ఆటోను రెంట్ తీసుకొని నడుపుతున్నాడు.

యాదాద్రికి 300 మంది ఓటర్లు, వారితో ప్రమాణాలు... ఈసీ సీరియస్‌, టీఆర్ఎస్ నేతలపై చర్యలకు ఆదేశం

అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో భర్త మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో శుక్రవారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగానే భార్య వద్ద గోల్డ్ చెయిన్ ఉండాలని, అది ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించాడు. దీంతో అది తన అన్నయ్య వద్ద ఉందని చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న భర్త ఆమెను కొట్టాడు.

ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ కీలక భేటీ.. మునుగోడు ఉపఎన్నిక, వెంకట్ రెడ్డి ఆడియోపై చర్చ

అతడి దెబ్బలకు తాళలేక భార్య కూడా ఎదురుతిరిగింది. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఆవేశంతో ఆమె తనకు దగ్గరలో ఉన్న ఇటుక రాయిని తీసుకొని భర్త తలపై కొట్టింది. దీంతో తలకు రక్త స్రావం కావడంతో కింద పడిపోయాడు. దీంతో ఆమె తన ఫ్యామిలీకి సమాచారం ఇచ్చింది. వారి వచ్చి చూడగా అప్పటికే సుమన్ చనిపోయి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు. సుమన్ తండ్రి మధునయ్య ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు