నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం

First Published Mar 31, 2017, 6:05 PM IST
Highlights

రాష్ట్రంలో సర్కారు ఆస్పత్రుల్లో సిబ్బంది తీరు ఏమీ మారలేదనడానికి నీలోఫర్ లో జరిగిన ఈ దారుణం ఓ నిదర్శనం.

తెలంగాణ లో సర్కారు ఆస్పత్రుల తీరు మారడం లేదు. సాక్షాత్తు సీఎం హెచ్చరించినా, ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనఖీలతో భయపెట్టినా దావాఖానాల సిబ్బంది లైట్ గానే తీసుకుంటున్నారు.

 

మొన్నామధ్య గాంధీ ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ ఇవ్వడానికి అక్కడి సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో ఓ బాధితుడు చిన్నపిల్లలు ఆడుకొనే బొమ్మ బైక్ మీద డాక్టర్ రూంకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ దృష్యాలు మీడియాలో ప్రసారం కావడంతో గాంధీ సిబ్బంది నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

దీంతో ప్రభుత్వం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆస్పత్రి సిబ్బంది విధినిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా రాష్ట్రంలో సర్కారు ఆస్పత్రుల్లో సిబ్బంది తీరు ఏమీ మారలేదనడానికి నీలోఫర్ లో జరిగిన ఈ దారుణం ఓ నిదర్శనం.

 

ప్రాణాపాయంతో ఉన్న తన కొడుకు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన తండ్రికి అక్కడ స్ట్రెచ్చర్ ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.  దీంతో చేసేది లేక ఆక్సిజన్ సిలిండర్ అమర్చి ఉన్న తన కొడుకును ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది.

 

click me!