ధైర్యంగా పరకాలలో ప్రచారం చేస్తా.. మహిళా సర్పంచ్‌ను అవమానించింది నువ్వు కాదా?: ధర్మారెడ్డిపై కొండా మురళి ఫైర్

Published : Jun 20, 2023, 02:44 PM ISTUpdated : Jun 20, 2023, 02:53 PM IST
ధైర్యంగా పరకాలలో ప్రచారం చేస్తా.. మహిళా సర్పంచ్‌ను అవమానించింది నువ్వు కాదా?: ధర్మారెడ్డిపై కొండా మురళి ఫైర్

సారాంశం

ఉమ్మడి  వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా ధర్మారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కొండా మురళి కౌంటర్ ఇచ్చారు.

ఉమ్మడి  వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా ధర్మారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. కొండా మురళి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ధర్మారెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. పరకాలలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. ధర్మారెడ్డి.. నా ఇంటి గేటు తెలుసా నీకు అంటూ నిలదీశారు. గతంలో ప్రగతి సింగారంలో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ధర్మారెడ్డి తన ఇంటిచుట్టూ మూడు రోజుల పాటు తిరిగాడని కొండా మురళి చెప్పారు.

పార్టీలు మారుతూ పైకొచ్చిన ధర్మారెడ్డికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. గతంలో సర్పంచ్‌గా ఉన్న సమయంలో సౌజన్యను ధర్మారెడ్డి అవమానిస్తే తన దగ్గరకు వచ్చి విలపించిందని తెలిపారు. సౌజన్యను ఎంపీపీ చేస్తానని ఆరోజే చెప్పానని అన్నారు. తాను చెప్పినట్లే ఆమెను ఎంపీపీని చేశానని చెప్పారు. సర్పంచ్‌గా ఉన్న మహిళను అవమానపరిచిన వ్యక్తి ధర్మారెడ్డిది అని విమర్శించారు. అధికారం ఎక్కువ రోజులు ఉండదని ధర్మారెడ్డి  గుర్తించాలని అన్నారు. ధర్మారెడ్డి మట్టి దొంగ అని విమర్శించారు. 

ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన వెంటతిరిగి కార్యకర్తలే తనవెంట వచ్చేందుకు రెడీగా ఉన్నారని కొండాల మురళి చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ ఎంత అభివృద్ది చేసిందో ప్రజలు తెలుసునని.. ఆమెను ప్రజలు గెలిపిస్తారని అన్నారు. పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వరంగల్ మొత్తానికి బీసీలు ముగ్గురే ఉన్నారని... అందులో పొన్నాల లక్ష్మయ్య, కొండా మురళి, కొండా సురేఖ ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కచ్చితంగా రెండు టికెట్లు అయితే ఇయ్యాలి కదా అని అన్నారు. 

కొండా మురళి భయపడే వ్యక్తి కాదని.. భయపడటం తన వంశంలో లేదని అన్నారు.తాను ధైర్యంగా పరకాల పోయి ప్రచారం చేస్తానని.. ధర్మారెడ్డి దమ్ముంటే ఆయన మనుషులతో ఆపాలని సవాలు విసిరారు. పరకాలలో ధర్మారెడ్డిని తమ వాల్లు ఉరికించకపోతే.. తాను వెనకకు తిరుగుతానని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల మెప్పు పొందేందుకు ధర్మారెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళ్లు మొక్కే సంస్కృతి బీఆర్ఎస్ లోనే ఉందని విమర్శించారు. తాను బ్రాహ్మణుల కాళ్లు మొక్కుతానని.. తెలివిలేని సన్నాసుల కాళ్లు మెక్కనని అన్నారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని కొండా మురళి తెలిపారు. తాను కొండా సురేఖని గెలిపిస్తానని.. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని.. మరెవరికైనా టికెట్ ఇస్తే, వారి గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్