అసలే ఇరుకైన బ్రిడ్జి.. పైగా 2 బస్సులు పక్క పక్కనే వచ్చాయి. దీంతో Footpath పై నడుచుకుంటూ వస్తున్న ఓ బాలుడు అవి తనపైకి వస్తాయేమోనని భయాందోళనలతో బ్రిడ్జి మీది నుంచి కిందికి దూకేసాడు. బ్రిడ్జ కింద నీళ్లు ఉండడంతో తనకు ఏమీ కాదనుకున్నాడో ఏమో తెలియాదు కానీ.. బాలుడు నేరుగా నీళ్లలో పడలేదు.
ఖమ్మం : భయం.. ఓ 9th class boy రెండు కాళ్లనూ క్షణాల్లో విరిచేసింది. Bus driver చేసిన ఓ చిన్న పొరపాటు.. ఆ చిన్నారిని శాశ్వత అంగవికలుడిగా మార్చేసింది. సెకన్లలో ఆ చిన్నారి జీవితం తలకిందులైపోయింది. కాకపోతే ప్రాణాలు పోకుండా బతికి బయటపడ్డాడు. ఈ హృదయవిదారకమైన ఘటన khammam జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే...
అసలే ఇరుకైన బ్రిడ్జి.. పైగా 2 బస్సులు పక్క పక్కనే వచ్చాయి. పెద్ద పెద్ద రోడ్ల మీదే అలా పక్కనే వస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఇరుకు బ్రిడ్జి మీద వస్తే.. ఊహించడానికి భయంగా ఉంది కదా. అలాంటి భయమే ఆ చిన్నారికి కలిగింది. దీంతో Footpath పై నడుచుకుంటూ వస్తున్న ఓ బాలుడు అవి తనపైకి వస్తాయేమోనని భయాందోళనలతో బ్రిడ్జి మీది నుంచి కిందికి దూకేసాడు.
undefined
బ్రిడ్జ కింద నీళ్లు ఉండడంతో తనకు ఏమీ కాదనుకున్నాడో ఏమో తెలియాదు కానీ.. బాలుడు నేరుగా నీళ్లలో పడలేదు. ఈ ఘటనలో ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కానీ అతని రెండు Legs broken అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీమనబోయిన ఈశ్వర్ (14) నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
భార్యకు తెలియకుండా భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, చితకబాది...
రోజులాగే మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఈశ్వర్ మార్గమధ్యంలో మున్నేరు బ్రిడ్జి ఫుట్ పాత్ మీదుగా నడుస్తున్నాడు. అదే సమయంలో బ్రిడ్జి మీదుగా వస్తున్న రెండు బస్సుల్లో.. ఓ బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ రెండు బస్సులు పక్కపక్కనే ఫుట్ ఫాత్ ను అనుకుంటూ వచ్చాయి.
బస్సులను గమనిస్తున్న ఈశ్వర్ అప్పటికే బ్రిడ్జి రెయిలింగ్ ను ఆనుకుని ఉండగా.. ఇంతలో హఠాత్తుగా ఒక బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. అది తనను చూసే కొట్టాడనుకున్నాడో ఏమో.. భయంతో బస్సు తనకు ఢీకొడుతుందేమో అని వణికిపోయాడు. అంతే, ముందూ, వెనకాల ఆలోచించకుండా అమాంతం ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి కింద ఉన్న నీళ్లలో దూకేశాడు.
జగిత్యాల: సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో భోజనం వికటించి... 25మంది విద్యార్థిణులకు తీవ్ర అస్వస్థత (Video)
అయితే, నీళ్లలో నేరుగా పడితే ప్రమాదం ఉండకపోయేది. కానీ పడడం పడడం నీటిలో కొద్దిగా తేలిన బండమీద పడడంతో బాలుడి రెండు కాళ్ళు విరిగి పోయాయి. స్థానికులు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ అశోక్ ఇచ్చిన సమాచారం మేరకు ఈశ్వర తండ్రి శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చారు. స్థానికుల సాయంతో బాలుడిని రోడ్డుపైకి తీసుకు వచ్చి ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు కింద పడుతున్న సమయంలో స్థానికులు, వాహనదారులు హాహాకారాలు చేశారు.