
92 kg ganja seized in Adilabad: అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ లో 92 కిలోల గంజాయిని తరలిస్తుండగా నలుగురి పోలీసులు అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిందితులంతా ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సద్దాంఖాన్, రెహమాన్ ఖాన్, , పవార్ రాజు అలియాస్ రాజేష్, రాథోడ్ శ్రీకర్ అని ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందిందని తెలిపారు. ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.9.20 లక్షలుగా గుర్తించారు. ముఠాలోని మరో నలుగురు సభ్యులు పరారీలో ఉన్నారనీ, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
నిందితులంతా ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సద్దాంఖాన్, రెహమాన్ ఖాన్, పవార్ రాజు అలియాస్ రాజేష్, రాథోడ్ శ్రీకర్ అని ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జన్నారంకు చెందిన పూజారి వెంకటేష్, నిర్మల్ కు చెందిన మహేష్, ఉట్నూర్ కు చెందిన మహ్మద్ సద్దాం హుస్సేన్, గవలే తుకారాం ఇంకా పరారీలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మావల మండల కేంద్రం శివారులో మహారాష్ట్రకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఉట్నూర్ లో నిల్వ చేసి మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్లు ఎస్పీ డీ.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.