జీహెచ్ఎంసీ ఎన్నికలు: మీ ఓటర్ స్లిప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!!

Siva Kodati |  
Published : Nov 29, 2020, 04:57 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: మీ ఓటర్ స్లిప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!!

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగుస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కమీషన్ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగుస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కమీషన్ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని డివిజన్ల వారీగా పంపిణీ చేసిన ఈసీ, అధికారులకు దిశానిర్దేశం చేసింది.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను సైతం చేపడుతోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల ద్వారా ప్రత్యేక ఓట‌రు చైత‌న్య కార్యక్రమాలను చేపట్టినట్లు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ వెల్లడించారు.

స‌ర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లతో స‌మావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు లోకేశ్ చెప్పారు.

‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ప్రజలు ఓట‌రు స్లిప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ యాప్‌లో ‘డౌన్‌లోడ్‌ యువర్‌ ఓటర్‌ స్లిప్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ చూపిస్తుందన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu