దారుణ హత్య: బాలుడిని చంపి ఇంటిపై పడేసిన దుండగులు

sivanagaprasad kodati |  
Published : Nov 13, 2018, 01:21 PM ISTUpdated : Nov 13, 2018, 01:27 PM IST
దారుణ హత్య: బాలుడిని చంపి ఇంటిపై పడేసిన దుండగులు

సారాంశం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది.. తొమ్మిదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపి.. మృతదేహాన్ని ఇంటిపై పడేశారు దుండగులు

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది.. తొమ్మిదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపి.. మృతదేహాన్ని ఇంటిపై పడేశారు దుండగులు. నకిరేకల్‌లోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో సాత్విక్ అనే బాలుడు నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు.

దీంతో తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ సాత్విక్ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కుటుంబసభ్యులు ఇంటి పైకప్పుపై బాలుడి మృతదేహాన్ని గుర్తించి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి..దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ