కేసీఆర్ టికెట్ ఇవ్వనందుకు అలక.. బీజేపీలోకి బొడిగె శోభ..?

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 12:13 PM IST
Highlights

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది.. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్ఎస్‌ను వీడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది.. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్ఎస్‌ను వీడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చొప్పదండి టికెట్‌పై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో శోభ గత కొంతకాలంగా అలకపూనారు.

సమయం గడుస్తున్నా అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆమె సోమవారం అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ చేరాలని మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడటంతో కమలం గూటికే చేరాలని శోభ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆమె అనుచరులు చెప్పారు. ఆమె ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమెతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీలో చేరేందుకే శోభ మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు శోభ పార్టీ వీడతారన్న వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆమెను బుజ్జగించేందుకు రెడీ అయ్యింది. 

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ

click me!