నిద్ర మాత్రలతో సంజయ్ హత్యలు: రఫికా, గొర్రెకుంట వద్ద 9 మంది మర్డర్స్

By narsimha lode  |  First Published May 25, 2020, 6:36 PM IST

ప్రియురాలు రఫికాను ఆమె బంధువులు మక్సూద్ తో పాటు తొమ్మిది మందిని హత్య చేసేందుకు నిందితుడు సంజయ్ నిద్రమాత్రలను ఉపయోగించాడు. ఈ రెండు ఘటనల్లో నిందితుడు నిద్రమాత్రలను ఉపయోగించాడు.
 



వరంగల్: ప్రియురాలు రఫికాను ఆమె బంధువులు మక్సూద్ తో పాటు తొమ్మిది మందిని హత్య చేసేందుకు నిందితుడు సంజయ్ నిద్రమాత్రలను ఉపయోగించాడు. ఈ రెండు ఘటనల్లో నిందితుడు నిద్రమాత్రలను ఉపయోగించాడు.

సహజీవనం చేసిన ప్రియురాలు రఫికా కూతురిపై కూడ సంజయ్ కన్నేశాడు. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.  బెంగాల్ రాష్ట్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకొందామని తీసుకెళ్లి హత్య చేశాడు.

Latest Videos

also read:ప్రియురాలి కూతురిపై కన్ను: రఫికా హత్యకు సంజయ్ ప్లాన్ ఇదీ...

మార్చి 7వ తేదీన గరీబ్ రథ్ రైలులో వెళ్లే సమయంలో నిందితుడు  సంజయ్ తన వెంట తీసుకెళ్లిన నిద్రమాత్రలను ఉపయోగించాడు.మజ్జిగ ప్యాకెట్లలో నిద్రమాత్రలను కలిపి ప్రియురాలు రఫికకు ఇచ్చాడు. నిద్రమాత్రల కారణంగా ఆమె మత్తులోకి చేరుకొన్న సమయంలో చున్నీతో ఆమె గొంతు పిసికి చంపి రైలు నుండి పారేశాడు.

రఫిక గురిచి మక్సూద్ కుటుంబం పదే పదే అడిగారు.అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో వారిని కూడ చంపాలని నిర్ణయం తీసుకొన్నాడు. వీరిని హత్య చేసేందుకు కూడ  నిద్ర మాత్రలను ఉపయోగించాడు.

హన్మకొండలోని ఓ మెడికల్ షాపు నుండి ఈ నెల 18వ తేదీన నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. ఈ నిద్రమాత్రలను పౌడర్ గా చేసి మక్సూద్ కుటుంబం తిన్న భోజనంలో కలిపాడు. మక్సూద్ కుటుంబం నివాసం ఉంటున్న భవన ప్రాంగణంలో ఉన్న బీహార్ యువకుల భోజనం కూడ నిద్రమాత్రల పౌడర్ కలిపాడు.

మత్తులో ఉన్న వారిని  గోనె సంచుల్లో మూట కట్టి గొర్రెకుంట బావిలో పారేశాడు సంజయ్. ఈ రెండు ఘటనల్లో నిందితుడు సంజయ్ నిద్రమాత్రలను ఉపయోగించి హత్యలు చేశాడు.
 

click me!