వైఎస్ షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు: ఎవరీ ప్రియ?

Published : Jul 02, 2021, 07:16 PM ISTUpdated : Jul 02, 2021, 07:19 PM IST
వైఎస్ షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు: ఎవరీ ప్రియ?

సారాంశం

తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న వైఎస్ షర్మిల తన వ్యూహకర్తను నియమించుకున్నారు. ప్రశాంత్ కిశోర్ వద్ద పనిచేసిన ప్రియను ఆమె తన వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలకు శ్రీకారం చుట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తన వ్యూహకర్తను ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధి పొందిన ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియ షర్మిల వ్యూహకర్తగా నియమితులయ్యారు.  తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియ. 

హైదరాబాదులోని లోటస్ పాండులో ప్రియ వైఎస్ షర్మిలను కలిశారు. సోషల్ మీడియా వ్యవహారాలను చూడడంతో పాటు షర్మిలకు సలహాలు, సూచనలు చేస్తారు. తమిళనాడులోని ఓ మీడియా సంస్థకు ప్రియ అధినేతగా ఉన్నారు. 

తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన ఆమె పార్టీ పేరును ప్రకటిస్తారు. షర్మిల ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ పలు సమస్యలపై గళమెత్తుతున్నారు. తెలంగాణలో పార్టీని బలపేతం చేయడానికి అవసరమైన చర్యలకు వైఎస్ షర్మిల కసరత్తు చేస్తున్నారు. 

తన కసరత్తులో భాగంగా వైఎస్ షర్మిల తన వ్యూహకర్తగా ప్రియను నియమించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రియ షర్మిల కోసం పనిచేస్తారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌