తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 169 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 169 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకుని తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,425కు చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కరోనా పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందితో పాటు మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు వైరస్ సోకింది.
undefined
శుక్రవారం కోవిడ్ 19తో నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 71కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,381 మంది డిశ్చార్జ్ అయ్యారు. 973 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read:హైదరాబాదులో కరోనా విజృంభణ: కమ్యూనిటి వ్యాప్తిపై సర్వే
కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి చెందిందా అనే విషయమై జీహెచ్ఎంసీ పరిధిలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. నగరంలోని ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు.
నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో సర్వేలైన్స్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు
ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ఐసీఎంఆర్ నివేదికను అందించనుంది.
Also Read:కరోనా కర్కశత్వం.. 80 యేళ్ల ముసలి తల్లిని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు..
హైద్రాబాద్ తో పాటు 14 మెట్రో నగరాల్లో హాట్ స్పాట్‌లలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. సర్వే ద్వారా హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ఐసీఎంఆర్ నివేదికను అందించనుంది.హైద్రాబాద్ తో పాటు 14 మెట్రో నగరాల్లో హాట్ స్పాట్‌లలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది
హైద్రాబాద్ పట్టణంలోని 500 శాంపిల్స్ సేకరించనున్నారు. ప్రతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి శాంపిల్స్ ను సేకరించనున్నారు. 18 ఏళ్ల వయస్సు పై బడిన వారి నుండి శాంపిల్స్ సేకరిస్తారు.