విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషమం: ఆసుపత్రికి తరలింపు

Siva Kodati |  
Published : May 29, 2020, 09:56 PM IST
విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషమం: ఆసుపత్రికి తరలింపు

సారాంశం

ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్ర తాళోజీ జైలులో వున్న ఆయనను అధికారులు ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు

ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్ర తాళోజీ జైలులో వున్న ఆయనను అధికారులు ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.

Also Read:భీమా కొరెగావ్ అల్లర్ల కేసు: వరవరరావు వ్యవహారంలో పుణే పోలీసుల కీలక నిర్ణయం

మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై వరవరరావున దాదాపు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురిని పుణే పోలీసులు 2018 ఆగస్టులో అరెస్ట్ చేశారు.

భీమా కోరెగావ్ అల్లర్లలో పాత్ర, మావోలతో సంబంధాలు, మోడీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు, ఆ తర్వాత మళ్తీ జైలుకు తరలించారు.

Also Read:మోడీపై వ్యతిరేకత నిజమేనా: కేసీఆర్‌కు వరవరరావు భార్య బహిరంగ లేఖ

వరవరరావును మొదట్లో పుణేలోని ఎరవాడ జైలులో, అనంతరం నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. కాగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు పిల్లలు, కుటుంబసభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu