ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : బంపర్ ఆపర్లిచ్చిన TSRTC.. ఆగస్ట్ 15న పుడితే 12యేళ్లు వచ్చేదాకా ఉచిత ప్రయాణం..ఇంకా...

By Bukka SumabalaFirst Published Aug 9, 2022, 6:46 AM IST
Highlights

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ఆ రోజు పుట్టిన చిన్నారులకు 12యేళ్లు వచ్చేవరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రకటించింది. 

హైదరాబాద్ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12  సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈనెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. టీ-24 బస్ టికెట్ ను ఆ రోజున రూ. 75కే  విక్రయిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.  మామూలు రోజుల్లో ఈ టికెట్ ధర 120 రూపాయలు ఉంటుంది. 

ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. ‘మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. ఆగస్ట్ 13 నుంచి15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని బస్సులు ఏర్పాటు  చేస్తాం.  ఉద్యోగులంతా అమృతోత్సవ్  బ్యాడ్జీలతోనే  విధులకు హాజరు కావాలి’  అని కోరారు..

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రీ షెడ్యూల్: ఆగష్టు 21 పరీక్ష 28న నిర్వహణ

ఆర్ టీసి ఇస్తున్న మరికొన్ని బంపర్ ఆఫర్లు…

- టిటిడి ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈనెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు..
- ఆగస్ట్ 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా..
- టాప్ 75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెట్ ఉచితం
- శంషాబాద్ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్పోర్టు సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75% ఛార్జి చెల్లిస్తే చాలు
- 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు. 75 ఏళ్ల లోపు వారికి రూ. 750లతో  వైద్యపరీక్ష ప్యాకేజీ

click me!