బాసర ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

By narsimha lodeFirst Published Aug 8, 2022, 10:15 PM IST
Highlights

బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగానే విద్యుత్ సరఫరాలో  అంతరాయం ఏర్పడింది. 
 

నిర్మల్:Basara IIITలో సోమవారం నాడు మధ్యాహ్నం నుండి Electricity సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  సాంకేతిక సమస్యతోనే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతతో విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

సోమవారం మధ్యాహ్నం నుండి  బాసర ట్రిపుల్ ఐటీలో విద్యుత్  సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  సోమవారం రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరాను పునరుద్దరించలేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం  విద్యుత్ సవరణ చట్టాన్ని విద్యుత్ ఉద్యోగసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

దీంతో విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కూడాఈ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు  విధులు బహిష్కరించారు దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు  ఎదుర్కొంటున్నారు.  

రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ 24 గంటల పాటు ఆందోళనకు దిగారు.  విద్యార్ధులతో ఇంచార్జీ వీసీ వెంకటరమణ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో విద్యార్ధులు ఈ నెల 1వ తేదీ నుండి క్లాసులకు హాజరౌతున్నారు. ఈ ఏడాది జూన్ మాసంలో వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీ వరకు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. జూన్ 21వ తేదీ నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే గత మాసంలో బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ ఫాయిజన్ కావడంతో ఒక్క విద్యార్ధి మరణించాడు. దీంతో రెండు వారాల క్రితం  విద్యార్ధులు 24 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. 

click me!