త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: సీఎల్పీనేత భట్టి విక్రమార్క

By narsimha lode  |  First Published Aug 8, 2022, 9:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పాదయాత్ర నిర్వహిస్తానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ పాదయాత్రకు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.


హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు Mallubhatti Vikramarkaచెప్పారు.  ఈ పాదయాత్రకు సంబంధించి త్వరలోనే తేదీని,రూట్ మ్యాప్ ను వెల్లడించనున్నట్టుగా భట్టి విక్రమార్క వివరించారు.

సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.CLP  నేతగా  రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని  పార్టీ అధినాయకత్వం తనను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు . వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత  తాను పాదయాత్ర చేస్తానన్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్, , ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాదయాత్ర నిర్వహించాలనే దానిపై చర్చించి మీడియాకు వెల్లడించనున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు నమ్మినవారెవరూ కూడా BJP లో చేరబోరన్నారు. 

Latest Videos

undefined

గతంలో కాంగ్రెస్ నుండి 12 మంది  టీఆర్ఎస్ లో చేరిన  ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ఈటల రాజేందర్  వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెంటనే రాజీనామాను ఆమోదింపజేసుకొన్నారన్నారు. 

కాంగ్రెస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సమయంలో  తనతో పాటు తమ పార్టీ నేతలు ఇదే డిమాండ్ చేసినట్టుగా ఆయన చెప్పారు.  ఆ సమయంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో  ఉన్నాడన్నారు. ఆనాడు తాము డిమాండ్ చేసినట్టుగా టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఈటల రాజేందర్ కూడా డిమాండ్ చేస్తే  ఎన్నికలు వచ్చేవన్నారు. ఆనాడు ఈ విషయమై మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఈటల రాజేందర్ ఇవాళ ఈ విషయమై మాట్లాడితే ఏం ప్రయోజనమన్నారు. ఇప్పటికైనా ఈ విషయమై ఈటల రాజేందర్ స్పందించారన్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేశారు. ఇవాళ స్పీకర్ పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా పత్రం అందించారు. రాజీనామా సమర్పించిన వెంటనే స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదించారు. 

ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖను గత వారమే సోనియా గాంధీకి పంపారు. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామాను స్పీకర్ కు సమర్పించి ఆమోదింపజేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి.

click me!