కరోనా సోకి 40రోజులకు కోలుకున్న 70యేళ్ల వృద్ధుడు.. అరుదైన ఘటన..

Published : Mar 02, 2022, 09:18 AM IST
కరోనా సోకి 40రోజులకు కోలుకున్న 70యేళ్ల వృద్ధుడు.. అరుదైన ఘటన..

సారాంశం

హైదరాబాద్ లో ఓ అరుదైన ఘటన జరిగింది. 70యేళ్ల వృద్ధుడికి కరోనా సోకగా.. 40 రోజుల పాటు దాంతో పోరాడి విజయం సాధించాడు. మంగళవారం పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. 

హైదరాబాద్ : Hyderabadలో ఓ 70 యేళ్ల వృద్ధుడు కోవిడ్ -19తో 40 రోజుల పాటు పోరాడి గెలిచాడు. 40 రోజుల క్రితం కరోనా బారిన పడిన ఇతను ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా బాధపడి ఆ తర్వాత కోలుకున్నాడు. బాధితుడు సిఎన్ మూర్తి, జనవరి 20 న సిటీ ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే బలహీనంగా ఉన్న అతను ఇన్ఫెక్షన్ సోకిన తరువాత 5 కిలోల బరువు తగ్గాడు.

కరోనా సోకిన నాలుగు వారాల తరువాత కూడా, అతని శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి కాలేదు. ఇలాంటి కేసు చాలా అరుదైనది అని డాక్టర్లు చెబుతున్నారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, సెంచరీ హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ పి రోహిత్ రెడ్డి సహా వైద్యులు అతడిని నిరంతరం పరిశీలించారు. 

"అతనికి 2010 నుండి వాస్కులైటిస్, బ్రెయిన్ ట్యూబర్‌క్యులోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌కి ఇమ్యునోసప్రెసెంట్స్ కారణం" అని కుమార్ చెప్పారు. మంగళవారం కోవిడ్ తో కోలుకున్న వ్యక్తి డిశ్చార్జి అయ్యారు.

ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. ఫోర్త్ వేవ్ .. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్  పరిశోధకులు అంచనా వేశారు. అయితే fourth wave తీవ్రత.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల ఆవిర్బావం, బూస్టర్ డోస్ పంపిణీ, ప్రజల వ్యాక్సినేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 24 వరకు కోవిడ్ నాలుగో వేవ్ కనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ స్టాటిస్టికల్ ప్రిడిక్షన్ ఫిబ్రవరి 24న ప్రీప్రింట్ సర్వర్ MedRxivలో ప్రచురించబడింది.

నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ అంచాల విషయంలో  కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేశారు. 

ఐఐటీ కాన్పూర్‌ని గణితం, గణాంకాల విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్ర శంకర్ ధర్ మరియు శలభ్ ఈ పరిశోధనను నిర్వహించారు.  2020 జనవరి 30 దేశంలో అధికారికంగా అధికారికంగా నమోదైన తేదీ నుండి 936 రోజుల తర్వాత భారతదేశంలో నాల్గవ వేవ్ రావచ్చని ఈ బృందం తెలిపింది. ‘నాలుగో వేవ్ జూన్ 22 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 23న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అక్టోబర్ 24 న ముగుస్తుంది’ వారు చెప్పారు. 

"చాలా దేశాలు ఇప్పటికే థర్డ్ వేవ్‌ను చూశాయి. కొన్ని దేశాలు మహమ్మారి నాలుగో వేవ్ ఎదుర్కోవడం ప్రారంభించాయి. జింబాబ్వే డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ మిశ్రమం యొక్క భావనను ఉపయోగించి భారత్‌లో థర్డ్ వేవ్ అంచనా వేయబడింది. భారతదేశంలో మూడవ వేవ్ పూర్తవుతున్నప్పుడు.. ఈ సూచన దాదాపు సరైనదని స్పష్టమైంది. ఆ అధ్యయనం ద్వారా ప్రేరేపించబడిన మేము నాలుగో వేవ్ అంచనాను పరిశోధించాం’ అని పరిశోధకులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!