తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్, 62కి చేరిన కేసులు

By Siva KodatiFirst Published Dec 28, 2021, 7:16 PM IST
Highlights

తెలంగాణ‌లో ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంగళవారం ప్రకటించింది.  దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది.

తెలంగాణ‌లో ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంగళవారం ప్రకటించింది.  దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. కేసులు పెరుగుతుండ‌టంతో వైద్య ఆరోగ్య‌ శాఖ అప్ర‌మ‌త్తమైంది. 

మరోవైపు కొత్త సంవ‌త్స‌రం వేడుల‌కు (new year celebrations) తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చింది.  మ‌ద్యం దుకాణాలు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్లు అర్థ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు ఓకే చెప్పింది. అయితే రాష్ట్రంలో ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌త్యేక అనుమ‌తులు ఇవ్వ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. స‌భ‌లు, ర్యాలీల‌కు అనుమ‌తులు నిరాక‌రించిన ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లకు మ‌ద్యం దుకాణాల‌కు ఎలా అనుమ‌తిస్తుందని పలువురు ప్ర‌శ్నిస్తున్నారు.  

Also Read:Yellow alert in Delhi: ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. సినిమా హాళ్లు, స్కూల్స్ మూసివేత.. వాటికి మాత్రమే అనుమతి..

కాగా.. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమైన కేజ్రీవాల్.. ఢిల్లీలో మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఢిల్లీ సర్కార్ ఎల్లో అలర్ట్ (Yellow alert in Delhi) జారీచేసింది. ఈ ఆంక్షలకు సంబంధించి ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ‘రెండు రోజులకు పైగా ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటోంది. అందుకే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్-1‌ను (ఎల్లో అలర్ట్) అమల్లోకి తీసుకొస్తున్నాం. అమలు చేసే ఆంక్షల వివరాలతో ఆదేశాలు త్వరలోనే విడుదల చేస్తాం’’అని అధికారులతో సమీక్ష అనంతరం సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఏల్లో అలర్ట్‌‌ ప్రణాళికలో భాగంగా ఆంక్షల జాబితాతో కూడిన ఉత్తర్వులను విడుదల చేసింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచిఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. జిమ్స్‌, యోగా సెంటర్లును మూసివేయనున్నారు. విద్యాసంస్థల తెరవడానికి అనుమతించరు. ఇక, రద్దీ కొనసాగితే, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మార్కెట్‌లను మూసివేయవలసి వస్తుంది అని కేజ్రీవాల్ అన్నారు. 
 

click me!