తెలంగాణ: 24 గంటల్లో 691 మందికి పాజిటివ్.. 6,38,721కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Jul 21, 2021, 09:57 PM ISTUpdated : Jul 21, 2021, 09:58 PM IST
తెలంగాణ: 24 గంటల్లో 691 మందికి పాజిటివ్.. 6,38,721కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 691 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఐదుగురు మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో 565 మంది కోలుకోగా..  తెలంగాణలో 9,908 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,14,260 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 691 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,38,721కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,771కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 565 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,25,042కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9,908 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 23, జీహెచ్ఎంసీ 85, జగిత్యాల 26, జనగామ 10, జయశంకర్ భూపాలపల్లి 9, గద్వాల 3, కామారెడ్డి 0, కరీంనగర్ 55, ఖమ్మం 56, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 19, మంచిర్యాల 37, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 9, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 38, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 7, పెద్దపల్లి 42, సిరిసిల్ల 19, రంగారెడ్డి 29, సిద్దిపేట 18, సంగారెడ్డి 7, సూర్యాపేట 47, వికారాబాద్ 5, వనపర్తి 9, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్