కొత్తగా 623 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,47,229కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 04, 2021, 09:11 PM ISTUpdated : Aug 04, 2021, 09:13 PM IST
కొత్తగా 623 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,47,229కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 594 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,803 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,12,796 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 623 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,229కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,814  చేరింది. వైరస్ నుంచి నిన్న 594 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం తెలంగాణలో 8,803 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 65, వరంగల్ అర్బన్ జిల్లాలో 59, ఖమ్మం జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 22, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 22, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 5, కామారెడ్డి 1, కరీంనగర్ 65, ఖమ్మం 52, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 9, మంచిర్యాల 19, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 33, ములుగు 6, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 41, నారాయణపేట 0, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 41, సిరిసిల్ల 20, రంగారెడ్డి 25, సిద్దిపేట 13, సంగారెడ్డి 8, సూర్యాపేట 24, వికారాబాద్ 2, వనపర్తి 5, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 59, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్