కొత్తగా 621 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,44,951కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Jul 31, 2021, 08:49 PM IST
కొత్తగా 621 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,44,951కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు.  691 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,069 యాక్టివ్‌ కేసులు వున్నాయి.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 621 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,44,951కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌‌లో తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,802కి చేరింది. 

ఒక్కరోజు వ్యవధిలో 691 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,32,080కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9,069 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  కాగా, కరీంనగర్ జిల్లాలో 67, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కేసులు గుర్తించారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98 శాతంగా నమోదైంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 22, జీహెచ్ఎంసీ 80, జగిత్యాల 31, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 1, కామారెడ్డి 4, కరీంనగర్ 67, ఖమ్మం 51, మహబూబ్‌నగర్ 7, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 9, మంచిర్యాల 19, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 7, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 36, నారాయణపేట 2, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 38, సిరిసిల్ల 18, రంగారెడ్డి 32, సిద్దిపేట 12, సంగారెడ్డి 4, సూర్యాపేట 20, వికారాబాద్ 6, వనపర్తి 3, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026