
ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో దళిత బంధు సహా అనేక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశానికి తెలంగాణ మంత్రులతో పాటు వ్యవసాయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొననున్నారు. ఇక ఈ కేబినెట్‌లో కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం . భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలు, పంట నష్టం, కృష్ణా జలాలు, దళిత బంధు పథకం అమలు, భూముల అమ్మకం, చేనేత కార్మికుల పథకానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సినిమా థియేటర్ల ప్రారంభం, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ అనంతరం హుజూరాబాద్ ఎన్నికపై పార్టీ నేతలతో కెసిఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.