హైద్రాబాద్ చాంచ్రాయణగుట్టలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న కారును పోలీసులు సీజ్ చేశారు. 600 జిలెటిన్ స్టిక్స్ , 600 డిటోనేటర్లను కారులో తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిలెటిన్ స్టిక్స్ ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిబంధనలకు విరుద్దంగా జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు గతంలో పలుమార్లు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. ట్రాన్స్ పోర్టు సంస్థల ద్వారా జిలెటిన్ స్టిక్స్ ను మావోయిస్టులు తెప్పించుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గతంలో వెలుగు చూశాయి. రాకెట్ లాంచర్లకు అవసరమైన విడి బాగాలను మావోయిస్టులు ట్రాన్స్ పోర్టు సంస్థల ద్వారా తెప్పించుకున్న విషయాన్ని పోలీసులు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.