ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు తెలంగాణ విద్యార్థులు..

Published : Mar 03, 2022, 12:40 PM IST
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు తెలంగాణ విద్యార్థులు..

సారాంశం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఆరుగురు తెలంగాణ విద్యార్థులు ఎట్టకేలకు స్వదేశానికి వచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా వీరు ఇండియాకు చేరారు. 

ఢిల్లీ : ఆరుగురు తెలంగాణ విద్యార్థులు రొమేనియాలోని బుకారెస్ట్ నుండి వచ్చిన మొదటి C-17 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారత్ చేరుకున్నారు. వీరు ఢిల్లీకి సమీపంలోని హిందాన్‌లోని భారత వైమానిక దళ స్థావరంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత వారిని అప్పగించారు. వారిని అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు తీసుకెళ్లారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ పీఆర్వో విభాగం ప్రకటించింది. 

ఇదిలా ఉండగా, OperationGanga కార్యక్రమంలో భాగంగా... Ukraineలో చిక్కుకున్న విద్యార్థులను bharat కు తరలించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చారు. ఈ తరలింపు ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోని భారత రాయబారులు సహకారంలో జరుగుతోంది. అలా తరలిస్తున్న విద్యార్థుల మనోథైర్యాన్ని చూసి పోలాండ్‌లోని భారత రాయబారి - నగ్మా మల్లిక్‌ అబ్బురపడ్డారంటూ జనరల్ విజయ్ కుమార్ సింగ్ ఓ వీడియో ట్వీట్ చేశారు. 

దీనికి ఆయన కామెంట్ చేస్తూ.. ‘పోలాండ్‌లోని భారత రాయబారి - Nagma Mallick.. పోలాండ్ ఉక్రెయిన్ సరిహద్దులోని బుడోమియర్జ్‌లో భారతీయ విద్యార్థులతో కొద్ది సేపు సరదాగా గడిపారు. ఆమె మాట్లాడుతూ  భారతీయ విద్యార్థుల మనోధైర్యం చాలా ఎక్కువ అని.. వారి resilience తనను ఆకట్టుకుందని ఆమె అబ్బురపడ్డారు. జై హింద్!’ #ఆపరేషన్ గంగ అని ట్వీట్ చేశారు. 

కాగా, యుద్ధతీవ్రత నెలకొన్న Ukraineలో చిక్కుకుపోయిన తన పౌరులను తరలించడానికి భారతదేశం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే, Russia, ఉక్రెయిన్ రెండు దేశాల్లోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి చేర్చేలా సాయం చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు తరలింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ లు ఎదుటి దేశాలు Indian studentsను hostagesగా ఉంచుకున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఉక్రెయిన్ భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. ఖార్కివ్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక బ్రీఫింగ్‌లో తెలిపింది.

మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ఒక ప్రకటనలో "మా డేటా ప్రకారం, ఖార్కివ్‌లో, ఉక్రేనియన్ అధికారులు ఉక్రేనియన్ నుంచి బెల్గోరోడ్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులను పెద్ద సంఖ్యలో బలవంతంగా నిర్బంధిస్తున్నారు" అన్నారు.

భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చింది : ఉక్రెయిన్
ఇదిలా ఉంటే, మరోవైపు ఉక్రెయిన్ MFA భారత్, పాకిస్తాన్, చైనా, ఇతర దేశాల విద్యార్థులను "రష్యన్ సాయుధ దురాక్రమణ దారులు బందీలుగా మార్చారు" అని ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఉద్రిక్త ప్రాంతాల నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై వారు చర్చించినట్లు సమాచారం.

ఇదిలావుండగా, 6000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. "యుద్ధవాతావరణం నెలకొన్న  ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20,000 మంది భారతీయులలో, 6,000 మందిని ఇప్పటివరకు స్వదేశానికి తరలించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది" అని చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ