తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం: 5684 మందికి కోవిడ్

By narsimha lode  |  First Published Aug 27, 2020, 11:47 AM IST

కరోనా తెలంగాణ పోలీసులను కలవర పెడుతోంది. లాక్ డౌన్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీస్ శాఖపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే విధి నిర్వహణలో వందలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు.



హైదరాబాద్: కరోనా తెలంగాణ పోలీసులను కలవర పెడుతోంది. లాక్ డౌన్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీస్ శాఖపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే విధి నిర్వహణలో వందలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు.

తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 54 వేల మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా హైద్రాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు ఎక్కువగా కరోనా  బారినపడ్డారు.  హైద్రాబాద్ కమిషనరేట్ లో 1967 మంది పోలీసులకు కరోనా సోకింది.

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలోని 5684 మందికి కరోనా సోకింది. వీరిలో 2284 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇంకా 3357 మంది కరోనా కోసం చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో 44 మంది పోలీసులు మరణించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  పోలీస్ సిబ్బందిలో 10 శాతం మందికి కరోనా సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ పరిధిలోని 1967 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది.

వీరిలో 891 మంది ఇంకా కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 1053 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా సోకి 23 మంది మరణించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో  526 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి కూడ 361 మంది ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. 163 మంది కరోనాను జయించారు. కరోనాతో ఇప్పటికే ఇద్దరు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరణించారు.
 

click me!