బోధన్‌ పెళ్లి వేడుకలో పాల్గొన్న 50 మందికి కరోనా: 42 ఇళ్లలో కోవిడ్ రోగులు

By narsimha lode  |  First Published Aug 27, 2020, 10:46 AM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో  పెళ్లి వేడుకలో పాల్గొన్న 50 మందికి కరోనా సోకింది. దీంతో వారిని వైద్యాధికారులు క్వారంటైన్ కి పరిమితం చేశారు. 



నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో  పెళ్లి వేడుకలో పాల్గొన్న 50 మందికి కరోనా సోకింది. దీంతో వారిని వైద్యాధికారులు క్వారంటైన్ కి పరిమితం చేశారు. 

జాగ్రత్తలు తీసుకోకుండా వేడుకలు నిర్వహించిన కారణంగానే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారంగా పెళ్లిళ్లు నిర్వహిస్తే ఈ రకమైన  ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Latest Videos

undefined

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలోని చెక్కీ క్యాంపులో పది రోజుల క్రితం పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకలో  పాల్గొన్న 50 మందికి కరోనా సోకింది. చెక్కీ క్యాంపులో 193 ఇళ్లున్నాయి. వీటిలో 42 ఇళ్లలోని వారికి కరోనా సోకింది. దీంతో క్యాంపులోని మిగిలిన వారంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. 

ఈ గ్రామంలో ఎక్కువ మంది పాల వ్యాపారం చేస్తుంటారు. కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొనడంతో పశువులను మేపేందుకు ఎవరూ కూడ బయటకు రాని పరిస్థితులు నెలకొనడంతో వారంతా మదనపడుతున్నారు. 

గ్రామంలో చాలా మందికి కరోనా సోకిన నేపథ్యంలో పశువులను మేపేందుకు ఎవరూ కూడ ముందుకు రాని పరిస్థితులు నెలకొనడంతో  గ్రామంలోని పాల కేంద్రాన్ని 20 రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు.
 

click me!