నల్గొండ జిల్లాలో తప్పిన ప్రమాదం: టైర్ పేలి ప్రైవేట్ బస్సు దగ్ధం, 45 ప్రయాణీకులు సురక్షితం

By narsimha lode  |  First Published Sep 2, 2022, 9:40 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సులోని 45 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.


నల్గొండ:ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదం నుండి బస్సులోని 45 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేట్ బస్సు టైరు పేలి మంటలు వ్యాపించాయి. హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై పెద్దకాపర్తి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని బస్సులోని ప్రయాణీకులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు రామన్నపేట నుండి ఫైరింజన్ ను రప్పించారు.

ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. హైద్రాబాద్ నుండి విజయవాడ వైపునకు ప్రైవేట్ బస్సు వెళ్లున్నసమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన డ్రైవర్  అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణీకులను బస్సు నుండి దింపారు.  ఈ బస్సులోని ప్రయాణీకులను మరో బస్సును రప్పించి విజయవాడకు పంపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంటలు అంటుకోవడంతో ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Latest Videos

 

click me!