తెలంగాణలో కొత్తగా 42 కేసులు.. 34 హైదరాబాద్‌లోనే: 1,634కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published May 19, 2020, 9:50 PM IST
Highlights

తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,634కి చేరుకుంది. ఇప్పటి వరకు 38 మంది కోవిడ్‌ 19తో మరణించారు.

తెలంగాణలో మంగళవారం కొత్తగా 42 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,634కి చేరుకుంది. ఇప్పటి వరకు 38 మంది కోవిడ్‌ 19తో మరణించారు. ఇవాళ 9 మంది డిశ్చార్జి కావడంతో, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,011కి చేరింది.

ప్రస్తుతం తెలంగాణలో 585 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నమోదైన కేసుల్లో 34 జీహెచ్ఎంసీలోనివే కాగా, 8 మంది వలస కూలీలు. వీరితో కలుపుకుని 77 మంది వలస కూలీలకు కోవిడ్ 19 సోకినట్లయ్యింది.

Also Read:భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు, 3వేలు దాటిన మరణాలు

మరోవైపు దేశంలో గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 4,630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 131 మంది కరోనా కారణంగా మరణించారు. కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.మొత్తంగా 100,328 కేసులు నమోదు కాగా 3,156 మంది మరణించారు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఇప్పటివరకు 92మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

Also Read:తెలంగాణ లో ప్రారంభమైన ఆర్టీసీ సేవలు : మొదటిరోజు బస్సులు ఖాళీ...

ఎయిమ్స్ ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన అధ్యాపకునికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో దాదాపు పదిమంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. మొత్తం 92మందిలో ఒకరు అధ్యాపకులు, ఇద్దరు రెసిడెంట్‌ వైద్యులు, 13మంది నర్సింగ్‌ సిబ్బంది, 45మంది సెక్యూరిటీ గార్డులతో పాటు మరో 12మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదిలాఉండగా దిల్లీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటగా 160మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదయ్యాయి. 

click me!