పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: జూన్ 2న ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వద్ద ఉత్తమ్, కోమటిరెడ్డి దీక్ష

By narsimha lodeFirst Published May 19, 2020, 5:53 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద దీక్ష చేయనున్నారు.

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద దీక్ష చేయనున్నారు.

పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్దమౌతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కరోజు గాంధీ భవన్ లో దీక్షకు దిగారు. పోతిరెడ్డిపాడు ప్రవాహా సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు 203 జీవోను జారీ చేసింది. ఈ విషయమై కేసీఆర్ సర్కార్ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

also read:జగన్ సర్కార్‌కు కృష్ణా బోర్డు షాక్: ముచ్చుమర్రి, హంద్రీనీవాకు నీళ్లు ఆపండి

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచితే తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని నీటి పారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎస్ఎల్‌బీసీ, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో చూపిన శ్రద్ద దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్ సర్కార్ చూపలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపును నిరసిస్తూ ఎస్ఎల్ బీసీ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు జూన్ రెండో తేదీన దీక్షకు దిగనున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ లో సంప్రదించారు. ఈ దీక్షతో పాటు ఆందోళన కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రకటించనుంది.

click me!