కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం మైనార్టీ గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 41 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగజ్‌నగర్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం మైనార్టీ గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ అయింది. దీంతో 41 మంది విద్యార్దులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు రాత్రి పూట భోజనంలో పురుగులు కన్పించడంతో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. అస్వస్థతకు గురైన విద్యార్ధులను గురుకుల పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంపై ఆరా తీస్తున్నారు.
గతంలో కూడ గురుకుల పాఠశాలలు, హస్టల్స్ లో పుడ్ పాయిజన్ తో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్స్ లో పుడ్ పాయిజన్ విషయమై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ విషయమై చర్యలు తీసుకొంటామని తెలిపారు.
undefined
రాష్ట్రంలోని పలు హస్టల్స్, గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులు అస్వస్థతకు గురికావడం చర్చకు దారితీసింది. ఈ నెల 5వ తేదీన వర్ధన్నపేట గిరిజన బాాలికల హస్టల్ లో పుడ్ పాయిజన్ అయింది.ఈ ఘటనలో 40 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్ధినులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భోజనంలో బల్లి ఆవశేషాలు కన్పించాయని బాధిత విద్యార్ధినులు ఆరోపించారు. ఈ భోజనం తిన్న విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఏడాది జూలై 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ తో ఓ విద్యార్ధి మరణించాడు. పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గరయ్యారు. దీంతో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని కూడా విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఈ ఏడాది జూలై 29వ తేదీన మహబూబాబాద్ గిరిజన బాలికల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా అస్వస్థత పాలయ్యారు. విద్యార్ధులకు వండే భోజనం నాణ్యంగా లేకపోవడం వంటలు చేసే కిచెన్ పరిసరాలు కూడ శుభ్రంగా లేకపోవడంతో విద్యార్ధులు అస్వస్థతకు గురౌతున్నారనే అభిప్రాయాలను విద్యార్ధి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి 13న ఆదిలాబాద్ భీంపూర్ కేజీబీవీలో 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు.ఈ ఏడాది జూన్ 27న సిద్దిపేట జిల్లాలోని మైనారిటీ బాలికల స్కూల్ లో పుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు.