అంబర్‌పేటలో 4 ఏళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి: హెచ్ఆర్‌సీలో కాంగ్రెస్ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Feb 22, 2023, 4:15 PM IST


అంబర్ పేట  వీధికుక్కల దాడిలో  నాలుగేళ్ల ప్రదీప్  మృతిపై  హెచ్ఆర్‌సీలో  కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు  చేసింది.


హైదరాబాద్: అంబర్‌పేటలో  వీధికుక్కల దాడిలో  నాలుగేళ్ల  ప్రదీప్ అనే చిన్నారి  మృతి చెందిన ఘటనపై   కాంగ్రెస్ పార్టీ నేతలు  బుధవారం నాడు హెచ్ఆర్‌సీలో  ఫిర్యాదు  చేశారు. 

అంబర్ పేటలో  వీధికుక్కల దాడి ఘటనపై  తెలంగాణ మంత్రి కేటీఆర్,  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలపై  కేసు నమోదు చేయాలని  కాంగ్రెస్ డిమాండ్  చేసింది.  ఈ విషయమై  హెచ్ఆర్‌సీలో పిటిషన్  దాఖలు  చేసింది.  మరో వైపు  మంత్రికేటీఆర్,  జీహెచ్ఎంసీ మేయర్ కు వ్యతిరేకంగా  ప్లకార్డులు ప్రదర్శించారు.  

Latest Videos

undefined

ఈ నెల  19వ తేదీన అంబర్ పేటలో  వీధికుక్కలు  నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై దాడి  చేశాయి. ఈ  దాడిలో  తీవ్రంగా గాయపడిన  చిన్నారి ప్రదీప్  మృతి చెందిన విషయం తెలిసిందే.  .   అంబర్ పేట ఘటనపై  ప్రభుత్వం  ఇంతవరకు  స్పందించకపోవడంపై  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్  తప్పుబట్టారు.  జీహెచ్ఎంసీ మేయర్  ఏం చేస్తుందో  ఎవరికీ అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు.  

అంబర్ పేట   ఘటనపై  ప్రభుత్వం  తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  బాధిత కుటుంబానికి మంత్రి  కేటీఆర్  క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

రాష్ట్ర వ్యాప్తంగా  ఇటీవల కాలంలో  కుక్కల దాడుల ఘటనలు  ఎక్కువగా  చోటు  చేసుకుంటున్నాయి. రెండు మూడు రోజుల వ్యవధిలోనే  కుక్కల దాడుల్లో  పలువురు  గాయపడ్డారు.  అంబర్ పేట  ఘటన తర్వాత  రాష్ట్ర వ్యాప్తంగా   వరుసగా  పలు జిల్లాల్లో  వీధి కుక్కల దాడుల నమోదయ్యాయి. 

also read:హైద్రాబాద్ లో వీధికుక్కల స్వైరవిహారం: రాజేంద్రనగర్‌లో ఐదుగురిపై దాడి

ఈ నెల  21న  హైద్రాబాద్  చైతన్యపురి  మారుతీనగర్ లో  వీధికుక్కలు  నాలుగేళ్ల బాలుడిపై దాడి  చేశాయి.  అదే రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం  ఎస్సీ హస్టల్ లో  సుమన్ అనే విద్యార్ధిపై దాడి  చేశాయి. ఇదే జిల్లాలోని వీణవంక మండలం  మల్లారెడ్డి  గ్రామంలో  బైకర్ యేసయ్యపై కుక్కలు దాడికి యత్నించాయి. ఈ ఘటనలోయేసయ్య  బైక్ పై నుండి  కిందపడి  గాయపడ్డాడు.  ఈ  నెల  22న హైద్రాబాద్  రాజేంద్రనగర్  పరిధిలో  ఎర్రబోడు కాలనీలో  ఐదుగురిపై  వీధికుక్కలు దాడి  చేశాయి. 
 

click me!