Omicron: తెలంగాణలో పెరుగుతోన్న ఒమిక్రాన్ బాధితులు.. కొత్తగా మరో నలుగురికి పాజిటివ్, 24కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 21, 2021, 08:10 PM ISTUpdated : Dec 21, 2021, 09:09 PM IST
Omicron: తెలంగాణలో పెరుగుతోన్న ఒమిక్రాన్ బాధితులు.. కొత్తగా మరో నలుగురికి పాజిటివ్, 24కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త మరో నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది.

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త మరో నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 726 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.  

ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,122 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 59 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 22 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ రాగా.. మిగిలిన వారిలో 24 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది.  

ALso Read:Omicron Cases In India: భారత్‌లో 200కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. మూడో స్థానంలో తెలంగాణ..

మరోవైపు భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases In India) సంఖ్య 200 మార్క్‌కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) మంగళవారం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినవారిలో 77 మంది కోలుకున్నట్టుగా తెలిపింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల నుంచి బయటపడినవే. ఈ రెండు రాష్ట్రాల్లో  54 చొప్పున ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇక, ఒమిక్రాన్ సోకిన వారిలో మహారాష్ట్రలో 28 మంది కోలుకోగా, ఢిల్లీల్లో 12 మంది కోలుకున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్