తెలంగాణలోనూ కొత్త వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకున్నాయి.
దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించింది. తెలంగాణలోనూ ఈ వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకున్నాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై కేంద్ర హాంశాఖ గురువారం సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా కొవిడ్ కట్టడికి కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
ALso Read:Omicron in Hyderabad: హైదరాబాద్ లో ఒమిక్రాన్ టెన్షన్ .. క్రమంగా పెరుగుతోన్న కేసులు
నగరంలోని Tolichowki పారామౌంట్ కాలనీలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు.. విస్తృత వేగంతో వ్యాపించే ప్రమాదమున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే చాలా రాష్ట్రాలకు విస్తరించింది. రానున్న రోజుల్లోనే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరించింది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని అన్ని కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్రం సూచించింది. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా పాల్గొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ నిత్యం దాదాపు 7వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 7974 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 343 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.