రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

Published : Feb 10, 2023, 08:31 AM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

సారాంశం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు, యాదయ్య, శ్రీను, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామిగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు