హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు, నలుగురి అరెస్ట్...

Published : Oct 21, 2022, 01:01 PM IST
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు, నలుగురి అరెస్ట్...

సారాంశం

హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం అర్థరాత్రి మన్సూరాబాద్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులు, పంటర్లు సహా నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుల్లో ఒకరి ఖాతాలో ఉన్న మరో 10.7 లక్షలను స్తంభింపజేశారు. వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్ మ్యాచ్‌పై నిందితులు బెట్టింగ్‌లు కాస్తున్నారు.

బుధవారం రాత్రి ఎల్‌బీనగర్‌ లో బెట్టింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారంతో మన్సూరాబాద్‌ సాయి సప్తగిరి కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 1లోని ఇంటిపై దాడి చేశారు. సబ్ బుకీ ఎం భాస్కర్ (35), అకౌంటెంట్ టి కోటేశ్వర్ రావు (30), ఇద్దరు పంటర్లు జి రాజేష్ కుమార్ (35), కె శ్రీనివాస్ నుండి 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీ యు సతీష్ రాజు పరారీలో ఉన్నాడు.

ఈ క్రమంలో పోలీసులు ఐసీఐసీఐ బ్యాంకుకు లేఖ రాసి కోటేశ్వరరావు ఖాతాలోని 10.7 లక్షలు స్తంభింపజేశారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్