హైద్రాబాాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గన్ తో హల్ చల్ చేశాడు.ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్:నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవరెడ్డి అనే వ్యక్తి గన్ తో సుబ్బయ్య అనే వ్యక్తిని శుక్రవారంనాడు తుపాకితో బెదిరించాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ సంజీవరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిలో పనులు నిర్వహిస్తున్న సుబ్బయ్యను తుపాకితో బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్ లో రామకృష్ణారెడ్డి భూమిలో నిర్మాణ పనులు చేస్తున్న సుబ్బయ్యను సంజీవరెడ్డి తుపాకీతో బెదిరించాడు.
నిన్న మధ్యాహ్నం సంజీవరెడ్డి తనను తుపాకీతో బెదిరించాడని సుబ్బయ్య మీడియాకు చెప్పారు.రెండేళ్లుగా ఈ భూమిలో కన్ స్ట్రక్షన్ పనులు తనకు ఇప్పించాలని సంజీవరెడ్డి తమపై ఒత్తిడి తెస్తున్నారన్నారని సుబ్బయ్య చెబుతున్నారు. తనకు రామకృష్ణారెడ్డి పనులు అప్పగించడంతో ఈ పనులు వదిలివపెట్టి వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకు వస్తున్నాడని ఆయన ఆరోపించారు. తాను పని చేయకుండా వెళ్లిపోతే ఈ పనిని సంజీవరెడ్డి దక్కించుకోవాలని చూస్తున్నాడని సుబ్బయ్య ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంజీవరెడ్డి నుండి తనకు ప్రాణహని ఉందని సుబ్బయ్య చెబుతున్నారు.
వివాదం ఇదీ....
మాదాపూర్ లోని సర్వే నెంబర్ 10లో రామకృష్ణారెడ్డికి 2550 గజాల స్థలం ఉంది.13 ఏళ్ల నుండి రామకృష్ణారెడ్డి ఆదీనంలో ఈ స్థలం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ భూమిలో ఉన్న ప్రహారీగోడ కూలింది. ఈ కూలిన గోడ స్థానంలో కొత్త గోడ నిర్మాణం పనులను రామకృష్ణారెడ్డి చేయిస్తున్నాడు. అయితే ఇదే సర్వేనెంబర్ లో 4 గుంటల భూమి నిర్మాత సరేష్ బాబుకు ఉంది.ఈ 4 గుంటల భూమి ఆక్రమిస్తున్నారనే వివాదం నెలకొంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సూపర్ వైజర్ ఫిర్యాదు చేశాడు. కన్ స్ట్రక్షన్ ఆపేందుకు దగ్గుబాటి సురేష్ బాబు సూపర్ వైజర్ ప్రయత్నించాడు.ఈ సమయంలోనే వివాదం పెరిగిందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు దగ్గుబాటి సురేష్ బాబు సూపర్ వైజర్ ఫిర్యాదు చేశారు. సంజీవరెడ్డి వద్ద ఉన్న గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని ఈ కథనం వెల్లడించింది.