అంబులెన్స్ లో పవర్ హౌస్‌లోకి వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి: ఆ మూడు ద్వారాల్లో పొగ

By narsimha lodeFirst Published Aug 21, 2020, 11:40 AM IST
Highlights

శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకొన్న  9మంది కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీశైలం: శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకొన్న  9మంది కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

పవర్ హౌస్ లోని మొత్తం మూడు ద్వారాల నుండి విపరీతంగా పొగ వస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. పవర్ హౌస్ లోకి వెళ్లేందుకు ఒక మార్గం ఉంటుంది. పవర్ హౌస్ నుండి బయటకు వెళ్లడానికి రెండు మార్గాలు ఉంటాయి.ఈ మూడు మార్గాల గుండా పొగ బయటకు వస్తోంది. దీంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని కర్నూల్ జిల్లా కలెక్టర్ మీడియాకు చెప్పారు.

పవర్ హౌస్ నుండి బయటకు వచ్చిన 10 మంది సిబ్బంది కూడ పొగ పీల్చి ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు.

పవర్ హౌస్ లోకి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంబులెన్స్ లో వెళ్లారు. సంఘటన స్థలంలో పరిస్థితిని ఆయన అదికారులతో సమీక్షించారు.   విపరీతమైన పొగను అదుపు చేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ పొగ ఎక్కడి నుండి వస్తోందో తెలియడం లేదని అధికారులు చెప్పారు. దట్టమైన పొగతో ముందు ఎక్కడ ఏముందో కూడ తెలియని పరిస్థితి నెలకొందని స్థానిక అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. హై ఓల్జేజీ లైట్లు వేసినా కూడ పొగతో పవర్ హౌస్ లో ఎక్కడ ఏముందో కన్పించడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
 

click me!