తెలంగాణ: కొత్తగా 389 మందికి పాజిటివ్.. 6,55,732కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 24, 2021, 10:16 PM IST
తెలంగాణ: కొత్తగా 389 మందికి పాజిటివ్.. 6,55,732కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 389 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 4203 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,276 యాక్టివ్‌ కేసులు వున్నాయి  

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 389 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,55,732కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో మహమ్మారి సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,862కి చేరింది. ఒకరోజు వ్యవధిలో 420 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,45,594కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 6,276 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 12, జీహెచ్ఎంసీ 70, జగిత్యాల 19, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 4, కామారెడ్డి 2, కరీంనగర్ 36, ఖమ్మం 20, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 8, మంచిర్యాల 10, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 4, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 28, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 18, సిరిసిల్ల 12, రంగారెడ్డి 24, సిద్దిపేట 7, సంగారెడ్డి 3, సూర్యాపేట 12, వికారాబాద్ 1, వనపర్తి 5, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 22, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్