తెలంగాణ: కొత్త కేసుల్లో తగ్గుదల.. 25 మంది మృతి, జీహెచ్ఎంసీలో అదే తీవ్రత

Siva Kodati |  
Published : May 19, 2021, 08:05 PM IST
తెలంగాణ: కొత్త కేసుల్లో తగ్గుదల.. 25 మంది మృతి, జీహెచ్ఎంసీలో అదే తీవ్రత

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. బుధవారం కొత్తగా 3,837 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,40,603కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 25 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 3037కు చేరింది. 24 గంటల్లో 4976 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 4,90,620 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,946 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు, తెలంగాణలో ఈ ఒక్కరోజే 71,070 కరోనా పరీక్షలు చేశారు. వీటిలో నుంచే 3837 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 2,628 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. జిల్లాల వారీగా కరోనా కేసుల విషయానికి వస్తే జీహెచ్ఎంసీలో 594 మందికి పాజిటివ్‌గా తేలింది.  

ఆతర్వాత వరుసగా .. ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 143, జగిత్యాల 101, జనగామ 44, జయశంకర్ భూపాల్‌పల్లి 53, జోగులాంబ గద్వాల్ 55, కామారెడ్డి 39, కరీంనగర్ 140, ఖమ్మం 227, కొమరంభీం ఆసిఫాబాద్ 26, మహబూబ్‌నగర్ 120, మహబూబాబాద్ 67, మంచిర్యాల 101, మెదక్ 47, మేడ్చల్ మల్కాజ్‌గిరి 239, ములుగు 45, నాగర్‌కర్నూల్ 139, నల్గొండ 175, నారాయణ్ పేట్ 32, నిర్మల్ 20, నిజామాబాద్ 62, పెద్దపల్లి 90, రాజన్న సిరిసిల్ల 75,  రంగారెడ్డి 265, సంగారెడ్డి 104, సిద్దిపేట 126, సూర్యాపేట 121, వికారాబాద్ 126, వనపర్తి 88, వరంగల్ రూరల్ 123, వరంగల్ అర్బన్ 139, యాదాద్రి భువనగిరిలో 94 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 
PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!