24 గంటల్లో 306 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6 6,59,313కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Sep 04, 2021, 09:19 PM IST
24 గంటల్లో 306 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6 6,59,313కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 366 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,673 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణ గడిచిన 24 గంటల్లో 306 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రం ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,59,313కు చేరింది. అలాగే వైరస్ వల్ల ముగ్గురు బలైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 3,883కి పెరిగింది.

ఈరోజు మహమ్మారి బారి నుంచి 366 మంది కోలుకున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 69,422 శాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 63,116 టెస్టులు ప్రభుత్వం నిర్వహించగా, మిగతావి ప్రైవేటు రంగంలో జరిగాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన 6,59,313 కరోనా కేసుల్లో 79.8శాతం అసింప్టమాటిక్ అంటే లక్షణాలు బయటకు కనిపించనివే అని ఈ కరోనా బులెటిన్‌లో పేర్కొన్నారు. మిగతా కేసుల్లోనే కరోనా లక్షణాలు కనిపించినట్లు వివరించారు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 78, జగిత్యాల 12, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 31, ఖమ్మం 14, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 7, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 16, ములుగు 3, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 14, నారాయణపేట 3, నిర్మల్ 2, నిజామాబాద్ 4, పెద్దపల్లి 10, సిరిసిల్ల 7, రంగారెడ్డి 12, సిద్దిపేట 6, సంగారెడ్డి 3, సూర్యాపేట 8, వికారాబాద్ 4, వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 23, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu
Alcohol : మగువలు మందుకొట్టే టాప్ 7 రాష్ట్రాలివే.. తెలంగాణ స్థానమెంత..?