కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

Siva Kodati |  
Published : Sep 04, 2021, 03:38 PM ISTUpdated : Sep 04, 2021, 04:36 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసి ఆయన.. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టం హామీలు, ఐపీఎస్‌ల సంఖ్యను 195కి పెంచాలని కోరారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసి ఆయన.. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టం హామీలు, ఐపీఎస్‌ల సంఖ్యను 195కి పెంచాలని కోరారు. అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన కేంద్ర నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి.. అమిత్ షాను కోరారు. దీనితో పాటు ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 

నిన్న ప్రధాని మోడీతో సమావేశమైన కేసీఆర్ పది అంశాలకు సంబంధించిన లేఖలను అందజేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై మోడీతో చర్చించారు. అలాగే ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు సరిపడా ఐపీఎస్‌లను కేటాయించాలని సీఎం ... మోడీని కోరారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌పైనా విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు జవహర్ నవోదయా విద్యాలయాలను కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐఐటీ ఏర్పాటు చేయాలని  కోరారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు అదనపు నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కేసీఆర్ .. మోడీని విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu