నిజామాబాద్‌: ఎంపీ అరవింద్‌కు నిరసన సెగ.. టీఆర్ఎస్ - బీజేపీ కార్యకర్తల రాళ్ల దాడి, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Dec 26, 2021, 05:59 PM IST
నిజామాబాద్‌: ఎంపీ అరవింద్‌కు నిరసన సెగ..  టీఆర్ఎస్ - బీజేపీ కార్యకర్తల రాళ్ల దాడి, ఉద్రిక్తత

సారాంశం

నిజామాబాద్ (nizamabad) జిల్లా ఇందల్వాయ్‌లో (indalwai) ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం బీజేపీ (bjp) - టీఆర్ఎస్ (trs) మధ్య రాళ్ల దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ (dharmapuri arvind) ప్రారంభోత్సవం చేయడంపై వివాదం చెలరేగింది. 

నిజామాబాద్ (nizamabad) జిల్లా ఇందల్వాయ్‌లో (indalwai) ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం బీజేపీ (bjp) - టీఆర్ఎస్ (trs) మధ్య రాళ్ల దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ (dharmapuri arvind) ప్రారంభోత్సవం చేయడంపై వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ బీజేపీ కార్యకర్తలు మద్ధతుగా నిలబడటంతో .. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

ఆదివారం గన్నారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవాలకు వెళ్ళారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన రావడానికి ముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ఏమైందంటూ నిలదీశారు. బాండ్ పేపర్, ప్లకార్డ్స్ చూపిస్తూ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే లేని సమయంలో ఎంపీ అరవింద్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తో బిజెపి టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట ,రాళ్లదాడి జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే