దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో కొత్తగా మరో 3 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. 41 మంది బాధితుల్లో 10 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో కొత్తగా మరో 3 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. 41 మంది బాధితుల్లో 10 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇకపోతే.. తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు.
undefined
ALso Read:తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే
కొద్దిపాటి నియంత్రణ చర్యలతోనే జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా విధించనున్నారు.
మరోవైపు భారత్‌లో శనివారం ఉదయం నాటికి 415 ఒమిక్రాన్ కేసుల నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 115 మంది కోలుకున్నట్టుగా (Recovered From Omicron) తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా పేర్కొంది. ఆ తర్వాత 79 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకే ఇండియాలో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్‌లో 22, హర్యానాలో 4 , ఒడిశాలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్మూ కాశ్మీర్‌లో 3 పశ్చిమ బెంగాల్‌లో 3, ఉత్తర ప్రదేశ్‌లో 2, చండీగఢ్, ఉత్తరాఖండ్, లడఖ్‌లలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.