హైద్రాబాద్‌లో ప్రహరీగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

Published : Feb 28, 2020, 07:28 AM ISTUpdated : Feb 28, 2020, 07:32 AM IST
హైద్రాబాద్‌లో ప్రహరీగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

సారాంశం

ఇంటి ప్రహరీగోడ కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.

హైదరాబాద్: హైద్రాబాద్  హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ వీధిలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

మృతి చెందిన వారిని ఆరేళ్ల రోషిణి, నాలుగేళ్ల పావని, సారికలుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రహరీగోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.

విషయం తెలిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గోడ కూలిపోవడానికి గల కారణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే