నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి

By Siva KodatiFirst Published Aug 30, 2022, 9:42 PM IST
Highlights

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా వున్న 2,910 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్ -2 663, గ్రూప్-3 1,373, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 294, గిడ్డంగుల సంస్థ‌లో 50 పోస్టులు, విత్త‌న ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లో 25 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్ప‌టికే ప‌లు శాఖ‌ల్లోని పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ .. ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు కూడా విడుదల చేసింది. తాజాగా మంగళవారం మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. వీటిలో గ్రూప్ -2 663, గ్రూప్-3 1,373, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 294, గిడ్డంగుల సంస్థ‌లో 50 పోస్టులు, విత్త‌న ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లో 25 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ALso REad:Telangana Govt Jobs : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఎన్ని ఉద్యోగాలంటే

కాగా.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా  ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగాల భర్తీపై దృష్టి చేశారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

click me!